జల్లికట్టుతో వీరత్వం
తమిళుల సాంప్రదాయ, సాహస క్రీడగా గుర్తింపు పొందిన జల్లికట్టును సంక్రాంతి పర్వదినాల్లో దక్షిణాది జిల్లాల్లో కోలాహలంగా జరుపుకోవడం ఆనవాయితీగా వసున్న విషయం తెలిసిందే. తొలిరోజు గురువారం అవనీయాపురంలో జల్లికట్టు జరిగింది. ఎద్దులను పట్టుకున్న వారికి, ఎవరికిచిక్కకుండా తప్పించుకున్న ఎద్దుల యజమానులకు సైకిళ్లు,బంగారు నాణెలు వంటి ఆకర్షణీయ బహుమతులను అందజేశారు. ఈ పోటీలను డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రి మూర్తి ప్రారంభించారు. ఇందులో 22 ఎద్దులను పట్టుకున్న బాల మురుగన్‌కు కారు, కార్తిక్ అనే యువకుడికి మోటారు సైకిల్ బహుమతిగా ఇచ్చారు. అలాగే ఎవ్వరికి చిక్కకుండా ఉత్త ప్రదర్శన చేసిన ముత్తుకరుప్పన్ ఎద్దుకు ట్రాక్టర్ అందజేశారు. ఈ పోటీలలో సుమారు 30 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్సలో ఉండగా, ఓ యువకుడు మరణించారు. కాగా, తిరుచ్చి జిల్లా శ్రీరంగం సమీపంలోని సూరయూరులో రూ. 3 కోట్లతో మినీ జల్లికట్టు స్టేడియం రూపుదిద్దుకుంది. దీనిని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులుఅన్బిల్ మహేశ్, కేఎన్‌నెహ్రూ ప్రారంభించారు.


