కనుమ కోలాహలం
శుక్రవారం కనుమ పండగను కోలాహలంగా జరుపుకున్నారు. తమ ఇళ్లల్లోని పశువులు, ఎద్దులు, బసవన్నలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాలలో పూజలు మిన్నంటాయి. రైతులు అయితే, తమ జీవితాలలో భాగమైన ఎద్దులు, పశువులకుభక్తి శ్రద్దలతో పూజలు చేశారు. ఇక అతిపెద్ద శివాలయాల వద్ద ఉన్న నంది విగ్రహాలకు సైతం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. ఎడ్ల బండ్లను అలంకరించి కొన్ని చోట్లో ఊరేగించారు. మరికొన్ని చోట్ల ఎడ్ల పందేలు, రేక్లా పోటీలు హోరెత్తాయి. తంజావూరులో ప్రసిద్ది చెందిన బృహదీశ్వర ఆలయం ఆవరణలోని నంది విగ్రహానికి అభిషేకాది పూజలతో, కొన్ని టన్నుల కూరగాయాలు, పండ్లతో అలంకరించారు.


