స్వగ్రామాలకు వెళ్లినవారు చైన్నెకి తిరిగి రావడానికి.. | - | Sakshi
Sakshi News home page

స్వగ్రామాలకు వెళ్లినవారు చైన్నెకి తిరిగి రావడానికి..

Jan 17 2026 8:26 AM | Updated on Jan 17 2026 8:26 AM

స్వగ్రామాలకు వెళ్లినవారు చైన్నెకి తిరిగి  రావడానికి..

స్వగ్రామాలకు వెళ్లినవారు చైన్నెకి తిరిగి రావడానికి..

● నాగర్‌కోయిల్‌–తాంబరం మధ్య 18న ప్రత్యేక రైలు

● నాగర్‌కోయిల్‌–తాంబరం మధ్య 18న ప్రత్యేక రైలు

తిరువొత్తియూరు: పొంగల్‌ ( సంక్రాంతి)పండుగను జరుపుకోవడానికి స్వగ్రామాలకు వెళ్లినవారు ఈనెల 18వ తేదీ (ఆదివారం) నుంచి చైన్నెతో సహా వివిధ నగరాలకు తిరిగి వస్తున్నారు. ఉదయం నుండి బస్సులు , రైళ్లలో ప్రయాణించడానికి రిజర్వేషన్లు చేసుకున్నారు. 19వ తేదీ (సోమవారం) పాఠశాలలు, కళాశాలలు , ప్రభుత్వ కార్యాలయాలు తెరవనున్నారు. దీంతో స్వగ్రామాలకు వెళ్లినవారు చైన్నెకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. దీంతో దక్షిణ జిల్లాల నుంచి బస్సులు , రైళ్లు అధిక సంఖ్యలో నడుస్తున్నాయి. అదనంగా ప్రత్యేక రైళ్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాగర్‌కోయిల్‌ నుండి తాంబరానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ ప్రత్యేక రైలు (నెం.06160) బయలుదేరి మరుసటి రోజు (సోమవారం) తెల్లవారుజామున 4.10 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈ సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక రైలు వల్లయూర్‌, నాంగునేరి, తిరునల్వేలి, కోవిల్‌పట్టి, సాత్తూర్‌, విరుదునగర్‌, మధురై, దిండిగల్‌, తిరుచి, వృద్ధాచలం, విలుప్పురం, చెంగల్పట్టు మీదుగా నడుస్తుంది. ఈ రైలుకు రిజర్వేషన్‌ శనివారం నుండి ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు.

‘దిత్వా’ బాధిత రైతులకు రూ. 112 కోట్లు

సాక్షి, చైన్నె : దిత్వా తుపాన్‌ బాధిత రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూ.112 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదలచేసింది. ఇది 85 వేల మంది రైతులకు ఆపన్న హస్తంగా మారింది. గత ఏడాది శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుపాన్‌ మళ్లీ సముద్రంలోకి ప్రవేశించి నాగపట్నం మీదుగా ప్రయాణించిన విషయం తెలిసిందే. ఇది చైన్నెకు అతిచేరువలో రెండు రోజులు కేంద్రీకృతమై చివరకు బలహీన పడింది. ఈ ప్రభావం చైన్నె, శివారు జిల్లాలు, డెల్టాలలోని నాగపట్నం, తిరువారూర్‌,తంజావూరు, కడలూరు, పుదుకోట్టై తదితర జిల్లాలపై అధికంగానే పడింది. డెల్టాలలో రైతులకు తీవ్రనష్టాలు కష్టాలు తప్పలేదు. రైతులను ఆదుకునే విధంగా సీఎం స్టాలిన్‌ ఆదేశాలతో ప్రభుత్వం రూ.112 కోట్లను కేటాయించింది. ఈ మేరకు అరియలూరు, కడలూరు, కోయంబత్తూరు, దిండుగల్‌, కాంచీపురం, కన్యాకుమారి, కృష్ణగిరి, మదురై, మైలాడుతురై, నాగపట్నం, పుదుకోట్టై, నీలగిరి, రామనాధపురం, రాణిపేట, సేలం, శివగంగ, తెన్‌కాశి, తంజావూరు, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, విరుదునగర్‌ తదితర జిల్లాలోని 84,848 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, వారికి ఎదురైన నష్టాలు, కష్టాలకు ఆపన్న హస్తం అందించే విధంగా ఈ నిధులను కేటాయించారు.

12 సీట్లకు టీఎంసీ కుస్తీ

సాక్షి,చైన్నె: అన్నాడీఎంకే నుంచి 12 సీట్లను రాబట్టుకునేందుకు తమిళ మానిల కాంగ్రెస్‌(టీఎంసీ)కుస్తీలు మొదలెట్టింది. జీకేవాసన్‌ నేతృత్వంలోని టీఎంసీ గత ఎన్నికలలో 6 చోట్ల పోటీ చేసి డిపాజిట్లను గల్లంతు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పార్టీ ఆ పార్టీకి తీవ్ర సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదు. పార్టీ గుర్తింపుతోపాటూ చిహ్నం సైకిల్‌ను దక్కించుకునేందుకు కనీసం 12 సీట్లలో పోటీ చేసి కనీస స్థానాలలో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నాడీఎంకే కూటమిలో తమకు ఈ మేరకు సీట్లు ఇస్తే అధికారిక ప్రకటన చేయడానికి టీఎంసీ వర్గాలు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అన్నాడీఎంకే ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. కాగా గతంలో టీఎంసీ నేత జీకే వాసన్‌ అన్నాడీఎంకే మద్దతుతో రాజ్యసభకు ఎన్నికై న విషయం తెలిసిందే.

విస్తృతంగా స్థానిక భాషలతో అనువాద అవకాశాలు

సాక్షి, చైన్నె : స్థాయిక వాయిస్‌, భాషలతో అనువాద అవకాశాలను విస్తృతంచేశామని, ఇందుకు కృత్రిమ మేథస్సు తోడ్పాట్గు ఉంటుందని మెటా సంస్థ ప్రకటించింది. ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలలో మెటా ఏఐ అనువాదాలను పరిచయం చేస్తూ శుక్రవారం స్థానికంగా ప్రకటించారు. ఈ మేరకు తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషలలో ఏఐ ఆధారంగా అనువాద అవకాశాలు కల్పించారు. ఇది నవంబర్‌ 2025లో ప్రకటించినప్పటికి, తాజాగా కార్యరూపంలోకి తీసుకొచ్చారు. హౌస్‌ ఆఫ్‌ ఇన్‌స్ట్రాగామ్‌ కార్యక్రమంలో భాగంగా ఏఐని ఉపయోగించి ఎలా అనువాదాలు చేసుకోవచ్చునో అన్న వివరాలపై అవగాహన కల్పించే విధంగాముందుకెళ్లారు. 400కు పైగా సౌండ్‌ ఎఫెక్ట్‌లకు ఇది అనుమతి ఇచ్చే కొత్త ఫీచర్‌గా ఉంటుందని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement