అజిత్ చిత్రం ప్రారంభం ఎప్పుడంటే?
తమిళసినిమా: కోలీవుడ్‌లో టాప్ హీరోల్లో నటుడు అజిత్ ఒకరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన చిత్రం వస్తుందంటే అభిమానులకు పండగే. అజిత్ ఇంతకుముందు గుడ్‌బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఇందులో నటి త్రిష నాయకిగా నటించారు. పక్కా కమర్షియల్ ఫార్ములాలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలరించింది. దీంతో అజిత్ తర్వాత చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న ఆసక్తి అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ నెలకొంది. కానీ ప్రస్తుతం అజిత్ కార్ రేస్ పోటీల్లో పాల్గొంటూ బిజీగా ఉండడమే. ఈయన అంతర్జాతీయ కార్ రేసుల్లో పాల్గొంటూ బహుమతులను గెలుచుకుంటున్నారు. అలా సినిమాలతోపాటు కార్ రేసులకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. కాగా అజిత్ 64వ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే ఆసక్తి నెలకొంది. అయితే ఈయన తర్వాత చిత్రానికి కూడా గుడ్‌బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్‌నే దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. కాగా తన తాజా చిత్రం గురించి అజిత్ పేర్కొంటూ మరో రెండు నెలల్లో తన 64వ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్ట.ం చేశారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇది అజిత్ అభిమానులు జోష్ నింపే వార్తే అవుతుంది.
నటుడు అజిత్‌తో
దర్శకుడు
అధిక్ రవిచంద్రన్


