జయంరవి చిత్రం షురూ! | - | Sakshi
Sakshi News home page

జయంరవి చిత్రం షురూ!

Oct 26 2024 1:03 AM | Updated on Oct 26 2024 4:51 PM

గణేశ్‌బాబు, జయంరవి

గణేశ్‌బాబు, జయంరవి

తమిళసినిమా: నటుడు జయంరవి చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన బ్రదర్‌ చిత్రం దీపావళి రేస్‌లో నిలవనుంది. అలాగే జీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలకు కమిట్‌ అయ్యారు. అలా జయంరవి తాజాగా కమిట్‌ అయిన చిత్రానికి డాడా చిత్రం ఫేమ్‌ గణేశ్‌బాబు దర్శకత్వం వహించనున్నారు. దీన్ని సుందర్‌ ఆరుముగన్‌ సమర్పణలో స్క్రీన్‌ సీన్‌ మీడియా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ప్రైవేట్‌ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికార పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశారు. 

ఈ పోస్టర్‌ చాలా వైవిధ్యభరితంగా ఉండి చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది జయంరవి నటిస్తున్న 34వ చిత్రం కావడం గమనార్హం. దీనికి హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ప్రదీప్‌ ఆంటోని ముఖ్యపాత్రను పోషించనున్నారని సమాచారం. త్వరలోనే సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను వెలువడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. జయంరవి వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొంటున్నా, వృత్తిపై దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement