
స్పైడర్ కోతి
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూర్‌లోని కాలడిపేటై కొత్త వీధిలో మంగళవారం రాత్రి మెక్సికన్ జాతికి చెందిన స్పైడర్ కోతి తిరుగుతున్నట్లు చైన్నె పోలీసు నియంత్రణ గదికి సమాచారం అందింది. దీంతో తిరువొత్తియూరు పోలీస్ సబ్–ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో పోలీసులు వెళ్లి పరిశీలించారు. అది స్పైడర్ జాతి కోతి అని తెలిసింది. వేలచ్చేరి అటవీ శాఖ ఉద్యోగులు దాన్ని చాకచక్యంగా పట్టుకుని, అటవీ శాఖ అధికారులు తెచ్చిన బోనులో బంధించి తీసుకెళ్లారు. దాన్ని వండలూర్ జంతు ప్రదర్శనశాలలో అప్పగించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
చింతచెట్టును ఢీకొట్టిన కారు – దంపతుల మృతి
తిరువొత్తియూరు: తేని జిల్లాలో కారు చింత చెట్టును ఢీ కొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వివరాలు.. తేని జిల్లా కదమలైకుండు కావేరి తొట్టం ప్రాంతానికి చెందినవారు మరియప్పన్ 62.అతని కుమార్తె తన కుటుంబంతో రాజపాళయం సమీపంలోని శివగిరిలో నివసిస్తుంది. ఆమె ఇంటిలో శుభ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు మారియప్పన్, అతని భార్య మాయా కృష్ణమ్మల్ (52), సోదరి సురులి యమ్మల్ (51), చిన్న కుమారుడు అశోక్‌కుమార్ (37), బంధువులు విజయభారతి (30), చిత్ర (28), సర్విన్ (9) మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కారులో వెళ్లారు. బుధవారం ఉదయం, వారి కారు ఉసిలంపట్టి సమీపంలోని మధురై–తేని ప్రధాన రహదారిపై వేగంగా వెళుతోంది. ఆ సమయంలో కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి చింత చెట్టును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో, కారు ముందు కూర్చున్న మరియప్పన్, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న అతని భార్య మాయకృష్ణమ్మల్ ఇద్దరూ కారులో చిక్కుకుని నుజ్జునుజ్జు అయ్యి మృతి చెందారు.
జ్ఞాపక శక్తి కోల్పోయి తిరుగుతున్న వృద్ధురాలి రక్షింపు
తిరువొత్తియూరు: జ్ఞాపకశక్తి కోల్పోయి చైన్నెలో తిరుగుతున్న ఉత్తరమేరూర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిని పోలీసు బృందం రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. విచారణలో, రక్షించబడిన వృద్ధురాలు తన పేరు మరియమ్మాళ్ అని, అయితే ఇంటి చిరునామా మాత్రం తెలియదని చెప్పింది. మరియమ్మాళ్ కొద్దిగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించి, ఆమెను 08.09.2025న చికిత్స కోసం మానసిక సంరక్షణ కేంద్రంలో చేర్పించి సంరక్షించారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు ఉత్తరమేరూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మరియమ్మాళ్‌ను మంగళవారంఆమె కుమార్తె గెంగమ్మాళ్, (50) భర్త కృష్ణన్‌కు అప్పగించారు. కాగా ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు స్వచ్ఛంద సేవకులు, సహాయం చేసిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
భార్యను చంపి భర్త ఆత్మహత్య
అన్నానగర్: విల్లుపురం జిల్లాలోని సెంజి సమీపంలోని పసుమలై తంగల గ్రామానికి చెందిన నమశ్శివాయం (60). ఇతని భార్య పద్మావతి (55) . ఈమె సెంజిలోని ఓ ఉర్దూ పాఠశాలలో పోషకాహార నిపుణురాలిగా పనిచేస్తున్నారు. వీరికి పాండురంగల్ (33 ), పాండియ రాజన్ (31) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పాండురంగల్ వివాహిత. ఈ స్థితిలో రోజూ సెంజిలో పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే పద్మావతి, సాధారణంగా తన భర్తతో కలిసి వ్యవసాయ భూమికి వెళ్లి ఆవులకు నీళ్లు పెట్టడం వంటి పనులు చేసి, రాత్రికి ఇంటికి తిరిగి వస్తుంది. ఈ నేపథ్యలంో మంగవారం సాయంత్రం, ఎప్పటిలాగే, నమచివాయం, పద్మావతి తమ ఇంటికి సమీపంలోని పొలానికి వెళ్లి రాత్రి 8 గంటల వరకు ఇంటికి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన బంధువులు స్వయంగా చూడటానికి వెళ్లినప్పుడు, పద్మావతి అక్కడి వాగులో మునిగిపోయి కనిపించింది. నమశ్శివాయం సమీపంలోని వేపచెట్టుకు ఉరికి వేలాడుతున్నాడు. ఇద్దరినీ రక్షించి వెంటనే సెంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు ఇద్దరూ అప్పటికే చనిపోయారని చెప్పారు. ఈ విషయం సత్యమంగళం పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల దర్యాప్తులో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని, ఘటన జరిగిన రోజు భార్య భార్యాభర్తలకు ఘర్షణ జరిగిందని ఇందులో నమశ్శివాయం భార్య పద్మవతిని నీటిలో ముంచి చంపి, తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
నేటి నుంచి బయో మెట్రిక్ స్క్రీనింగ్
కొరుక్కుపేట: తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి ఇమ్మిగ్రేషన్ విభాగంలో కొత్త బయోమెట్రిక్ స్క్రీనింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇది మొదటి దశలో తిరుచ్చి, లక్నో సహా విమానాశ్రయాల్లో అమలు చేయనున్నారు. ఇందుకోసం, తిరుచ్చి విమానాశ్రయంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రయాణికుల వివరాలను మొదటి ట్రిప్ సమయంలో బయోమెట్రిక్‌గా నమోదు చేస్తారు. భవిష్యత్తులో ఇమ్మిగ్రేషన్ తనిఖీలను సరళమైన పద్ధతిలో త్వరగా నిర్వహించవచ్చని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమై గురువారం నుంచి ప్రయాణికులకు ఈ ప్రక్రియ సులభతరం, మరింత ప్రభావవంతంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

క్లుప్తంగా