వివాహేతర సంబంధం..‘పరువు పోతుంది, నా భర్తను వదిలేయ్‌’

- - Sakshi

తిరువళ్లూరు: భర్తతో వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని కోరిన పాపానికి మహిళపై దాడి చేసి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసిన వ్యవహరంలో మహిళ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌ ప్రాంతానికి చెందిన సెంథిల్‌రాజ్‌(38). ఇతనికి కీళానూర్‌ గ్రామానికి చెందిన మదన్‌ భార్య నిత్య(34)తో వివాహేతర సంబంధం ఉంది.

ఈ విషయం సెంథిల్‌రాజ్‌ భార్య తామరసెల్వికి తెలియడంతో పలుమార్లు భర్తను నిలదీసింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నేరుగా నిత్యకు ఫోన్‌ చేసి తన భర్తతో వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని సూచించింది. అయితే నిత్య ఇందుకు ససేమిరా అనడంతో పాటు సెంథిల్‌రాజ్‌తో సన్నిహితంగా వున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

ఈ పోస్టు వైరల్‌గా మారిన నేపథ్యంలో తమ కుటుంబ పరువు పోతుందని భావించిన తామరసెల్వి మరోసారి నిత్యకు ఫోన్‌ చేసి ఘర్షణకు దిగింది. ఆగ్రహించిన నిత్య తన బంధువులైన వినోద్‌(22), గణేష్‌(24)తో వచ్చి తామరసెల్విపై దాడి చేసి ఆమె ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసింది. దాడిలో గాయపడిన తామరసెల్వి మనవాలనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top