సూర్యాపేట : భారత పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన శంషాబాద్ వయా సూర్యాపే చైన్నె బుల్లెట్ రైలు మొదటి అలైన్‌మెంట్‌ను మార్చొద్దని బుల్లెట్ రైలు, రైల్వే కారిడార్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని శ్రీగ్రాండ్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అలైన్‌మెంట్‌ను మార్చేందుకు కుట్ర పడుతున్న దొంగలు పనిపడతామన్నారు. 15 తర్వాత చేపట్టే పోరులో సూర్యాపేట సత్తాచాటుతామన్నారు. కార్యక్రమంలో కన్వీనర్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, రమణా చారి, ధర్మార్జున్, మల్లు నాగార్జునరెడ్డి,కిషన్, బెజవాడ వెంకటేశ్వర్లు, డేవిడ్ కుమార్, కె.శివకుమార్, బి.రాములు, వనిత, నాగయ్య, వెంకటేశ్వర్లు, బాలస్వామి పాల్గొన్నారు.
ఉద్యమానికి బీజేపీ మద్దతు
సూర్యాపేట మీదుగా బుల్లెట్ రైలు, రైల్వే కారిడార్ రావాల్సిందేనని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. సూర్యాపేటలో బుల్లెట్ రైలు సాధన కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రుక్మారావు, మన్మథరెడ్డి, రమేష్, గుణగంటి పృథ్వీ, నరేందర్‌రెడ్డి, పాండురంగాచారి పాల్గొన్నారు.


