నేడే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

ఏడు డిపోల్లో పోలింగ్‌

రామగిరి(నల్లగొండ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) గుర్తింపు యూనియన్‌ ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరగనున్నాయి. ఉదయం 5 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి వరకు ఫలితాలు వెల్లడించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కార్మికులంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.

9 మంది అభ్యర్థుల మధ్య గట్టి పోటీ..

ఈ విడత గుర్తింపు ఎన్నికల్లో మొత్తం 12 యూనియన్లు పరోక్షంగా, ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ రీజియన్‌ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. క్షేత్రస్థాయిలో ప్రధాన కూటముల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రతి ఒక్క ఓటరును నేరుగా కలిసి ప్రచారం ముగించిన నేతలు తమదే గెలుపని ధీమాతో ఉన్నారు.

దసరా వేళ..

దసరా, బతుకమ్మ పండుగల రద్దీ నెలకొననున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఆర్టీసీ యాజమాన్యానికి పెద్ద పరీక్షగా మారింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

ఫలితంపై తీవ్ర ఉత్కంఠ

సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రత్యేక కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉండటంతో గెలుపు ఎవరిని వరిస్తుందోనని కార్మిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నల్లగొండ రీజియన్‌ కార్మికులు ఎవరికి పట్టం కడతారో శుక్రవారం రాత్రి వరకు తేలిపోనుంది.

ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏడు డిపోల్లో డిపోకు ఒక పోలింగ్‌ బూత్‌ చొప్పున, నల్లగొండలో రెండు చొప్పున మొత్తం 8 కేంద్రాలను సిద్ధం చేశారు. కార్మికుల విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉమ్మడి నల్లగొండ రీజియన్‌ వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్‌ సిబ్బందితో కలిపి మొత్తం 2,036 మంది ఓటర్లు ఉన్నారు. దూర ప్రాంత సర్వీసుల్లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూసేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఫ ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌

ఫ ఉమ్మడి జిల్లాలో ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలు

ఫ పోలింగ్‌ ముగియగానే ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఫ రాత్రి వరకు తేలనున్న ఫలితాలు

ఫ ఓటుహక్కు వినియోగించుకోనున్న 2,036 మంది కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement