కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్య | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్య

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

నేరేడుచర్ల : ప్రభుత్వ కళాశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన విద్య అందుతుందని ఇంటర్‌ బోర్డు జిల్లా విద్యాధికారిణి సులోచనరాణి అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని గురువారం నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ ఆడారు. అదేవిధంగా విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సులోచనరాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్‌, యూనిఫాం అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలవుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ నీరజ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గీతాబాయి, అధ్యాపకులు వెంకటరమణ, సైదులు, ప్రణతి, కేఎల్‌ఎన్‌ రావు, వెంకన్న, శ్రీనివాసులు, సునిత, ప్రసాద్‌, అంజయ్య, నర్సింహచారి, గణేష్‌, వీరు, వెన్నెల, జానకిరాంరెడ్డి, సిబ్బంది అన్వేష్‌, వెంకన్న, దుర్గయ్య, సుశాంత్‌, శ్రీనివాస్‌ తదితరులున్నారు.

ఫ ఇంటర్‌ బోర్డు జిల్లా

విద్యాధికారిణి సులోచనరాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement