ప్రగతిశీల రచయిత.. కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రగతిశీల రచయిత.. కుమార్‌

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

కోదాడరూరల్‌ : కోదాడ గర్వంగా గుర్తుంచుకోదగిన ప్రగతిశీల రచయిత కుమార్‌ అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. గురువారం కోదాడలోని ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన రిటైర్డ్‌ అధ్యాపకులు, రచయిత కుమార్‌ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. తెలుగు సాహిత్యంలోనే అతిపెద్ద కవితను కుమార్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించారని, అది త్వరలోనే వెలుగులోకి రాబోతుందని తెలిపారు. కార్యక్రమంలో కుమార్‌ తండ్రి రిటైర్డ్‌ అధ్యాపకులు శ్రీరామకవచం వెంకటేశ్వర్లు, తెలుగు అకాడమీ డైరెక్టర్‌ బట్టు రమేష్‌, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ అందె సత్యం, గురుకులాల మాజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అప్పారావు, రవిచంద్ర, కేలోజు రమేష్‌, విద్యాసాగర్‌, రాయపూడి చిన్ని, సవతా సుబ్రహ్మణ్యం, శంకర్‌, పాకనాటి రాఘవరెడ్డి ఉన్నారు.

ఫామ్‌పాండ్‌ గుంతలు నిర్మించుకోవాలి

కోదాడ(మోతె): విబిజీ రామ్‌జీ పథకంలో భాగంగా రైతులు వ్యవసాయ భూముల్లో ఫామ్‌పాండ్‌ గుంతలు నిర్మించుకోవాలని జెడ్పీసీఈఓ శిరీష అన్నారు. గురువారం మోతె మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో ఫామ్‌పాండ్‌ గుంతలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎక్కువ మంది రైతులు ఫామ్‌పాండ్‌ గుంతలు నిర్మించుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో పింఛన్‌ దరఖాస్తులు పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ సందీప్‌కుమార్‌, సర్పంచ్‌ మద్ది మంజుల భాస్కర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రేణుక, ఏపీఓ నగేష్‌, ఈసీ శ్రీహరి, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మల్లయ్య ఉన్నారు.

సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి

సూర్యాపేట అర్బన్‌: జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి పంటలు ఎండిపోతున్నాయని, సూర్యాపేటను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంటలకు అవసరమైన సమయంలో నీరు, విద్యుత్‌ అందక పొలాల్లోనే ఎండిపోతున్నాయన్నారు. పంట చేతికందే సమయంలో విద్యుత్‌ కోతలు విధించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రోజుకు కేవలం 6 గంటల వరకు మాత్రమే విద్యుత్‌ అందుతున్న పరిస్థితుల్లో వ్యవసాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.

ఐదు నెలలుగా కార్యాలయంలోనే..

కోదాడ : కోదాడలోని ప్రధాన కూడళ్లలో చెత్తను రోడ్లపై వేయకుండా తడి, పొడి చెత్తతోపాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించేందుకు మున్సిపల్‌ అధికారులు ఐదు నెలల క్రితం మూడు రంగుల డబ్బాలను భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ డబ్బాలన్నీ మున్సిపల్‌ కార్యాలయంలోని ఒక గదిలో మూలుగుతున్నాయి. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ చెత్త డబ్బాలను వెంటనే ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement