3 లక్షల ఎకరాలు | - | Sakshi
Sakshi News home page

3 లక్షల ఎకరాలు

Oct 9 2026 1:56 AM | Updated on Oct 9 2026 1:56 AM

నాలుగింట ఒక్కటే క్లియర్‌..

నాన్‌ అగ్రికల్చర్‌లోనూ..

నిషేఽధిత

జాబితాలో

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పట్టా భూములు కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేరడంతో రైతులు, భూ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఏళ్ల తరబడి పట్టా భూములుగా కొనసాగుతూ, సాగు చేసుకుంటున్న భూములు సైతం ప్రభుత్వ భూములుగా నమోదవడంతో ఆందోళన చెందుతున్నారు. తాతల కాలం నుంచి అనుభవిస్తున్న భూములు, గతంలో క్రయవిక్రయాలు జరిగిన స్థలాలు కూడా 22ఏ జాబితాలోకి వెళ్లడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రైతులు తహసీల్దార్‌ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.87 లక్షల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములు 22ఏ పరిధిలోకి వెళ్లాయి. అంతేకాదు వ్యవసాయేతర భూములు పెద్ద సంఖ్యలో 22ఏ జాబితాలో ఉండటంతో సమస్య తీవ్రంగా మారింది. ప్రభుత్వం దరఖాస్తుల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రికార్డులు, హక్కులు, సర్వే నంబర్లు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు తదితర అంశాలను అధికారులు పరిశీలించిన తర్వాతే భూమిని 22ఏ నుంచి తొలగింపునకు చర్యలు చేపడుతున్నా.. పెద్ద సంఖ్యలో తిరస్కరిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నల్లగొండలోనే 1.46 లక్షల ఎకరాలు

నల్లగొండ జిల్లాలోని 33 మండలాల పరిధిలో 1,46,936 ఎకరాల వ్యవసాయ భూములు 22ఏ జాబితాలో చేరినట్లు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీటిలో పట్టా భూములు కూడా ఉం ్డడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సాగు చేసుకుంటున్న భూములను విక్రయించుకోవా లన్నా, అవసరానికి బ్యాంకు రుణం తీసుకోవా లన్నా, వారసత్వ బదలాయింపు చేసుకోవాలన్నా రికార్డుల్లో 22ఏ నిషేధిత జాబితా అడ్డంకిగా మారుతోంది. తమ భూములు పొరపాటున నిషేధిత జాబితాలో చేరాయని పేర్కొంటూ రైతులు రెవె న్యూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల పరిశీలన అనంతరం తొలగింపులు జరుగుతున్నా.. అత్యధిక గ్రామాల్లో ఇంకా సమస్య పరిష్కారం కాకపోవడంతో భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో 1,11,591 ఎకరాలు 22ఎలో చేరాయి. అందులో 8,591 ఎకరాలు నాన్‌ అగ్రికల్చర్‌, 1,03,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. నాన్‌ అగ్రికల్చర్‌కు సంబందించి 73 దరఖాస్తులు రాగా అందులో 26 దరఖాస్తులు క్లియర్‌ అయ్యాయి. 32 తిరస్కరణకు గురి కాగా, 15 ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు చేసుకున్నారు.

కోదాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఒకటి వక్ఫ్‌ భూమిగా తేలడంతో తిరస్కరించారు. మిగిలిన మూడు దరఖాస్తుల్లో తమ సర్వే నంబర్‌ పొరపాటున నిషేధిత జాబితాలోకి వచ్చిందని పేర్కొనడంతో వాటిని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పరిశీలనకు పంపించారు. జిల్లా అధికారి వాటిని కలెక్టరేట్‌లోని రెవెన్యూ అధికారులకు పంపగా.. రెండు దరఖాస్తులను నిలిపివేశారు. మరో దరఖాస్తులో భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్‌ చేయాలని కలెక్టరేట్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఫ పట్టా భూములు సైతం 22ఏ లోకి..

ఫ ఒక్క నల్లగొండలోనే

లక్షన్నర ఎకరాలు

ఫ మిగతా రెండు జిల్లాల్లో మరో

లక్షన్నర ఎకరాలపై నిషేధం

ఫ ఆందోళన చెందుతున్న

రైతులు, ప్రజలు

ఫ నిషేధిత జాబితా నుంచి

తొలగించాలని రెవెన్యూ

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

వ్యవసాయ భూములకే కాకుండా వ్యవసాయేతర భూములు, ఇళ్ల స్థలాలు కూడా 22ఏ జాబితాలో చేరాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 22ఏలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ల కోసం 87 మంది జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 42 దరఖాస్తులు పరిష్కరించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించగా 19 దరఖాస్తులు తిరస్కరించారు. మరో 26 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూమికి సంబంధించిన రికార్డులు, హక్కులు, సర్వే నంబర్లు తదితర అంశాలను అధికారులు పరిశీలించిన అనంతరం అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement