మఠంపల్లి: మట్టపల్లిలోని శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సహిత భక్త ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా యాజ్ఞీకులు బొర్రావెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రార్థనా సూక్తపఠనం, అనుజ్ఞస్వీకారం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని దీీపారాధన, పంచగవ్య ప్రాశన, రుత్విగ్వరణం, దీక్షాధారణ, రక్షాబంధనం, మేదినీపూజ, మత్స్యంగ్రహణం, అంకురారోపణతో ఉత్సవాలు ప్రారంభించారు. అంతకు ముందు చైన్నెకి చెందిన స్వాతి నక్షత్ర యజ్ఞవాటిక ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించిన పవిత్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, స్వాతి నక్షత్ర ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసన్, తూమాటి శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు, రామాచార్యులు, అద్దెపల్లి లక్ష్మ ణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి పాల్గొన్నారు.


