అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Oct 8 2026 4:00 AM | Updated on Oct 8 2026 4:00 AM

అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేటటౌన్‌ : సైబర్‌ మోసాలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. సైబర్‌ మోసాల నివారణ, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన పోలీస్‌ ప్రజా భరోసా, సైబర్‌ జాగ్రత్త్‌ దివస్‌ కార్యక్రమంలో ఆగండి–ఆలోచించండి, ధ్రువీకరించిండి నిర్ణయం తీసుకోండి అనే నినాదంతో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌లు అనూష, రవితేజ, సూర్యాపేట డివిజన్‌ డీఎస్పీ ప్రసన్న కుమార్‌, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, టెక్నికల్‌ టీమ్‌ ఎస్‌ఐ సాయిరామ్‌, ఆర్‌ఎస్‌ఐ సాయిరామ్‌, సురేష్‌, మహేష్‌, జిల్లా సైబర్‌ సెక్యూరిటీ సెల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement