సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్లతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. సైబర్ జాగ్రత్త దినోత్సవంలో భాగంగా సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం సైబర్ సెక్యూరిటీపై నిర్వహించిన అవగాహన సదస్సులో సైబర్ నేరాల నివారణ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల అత్యాశ, అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అపరిచిత ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ, ప్రిన్సిపాల్ మాలతి, సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, ఎస్‌ఐలు, షీ టీమ్ సిబ్బంది, పోలీస్ కళాబృందం, వైద్య అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నరసింహ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపుపై బుధవారం డీజీపీ సీవీ.ఆనంద్ జిల్లాల అధికారులతో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు సూర్యాపేట పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డీజీపీ పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, డీసీఆర్బీ బీఎస్పీ రవి, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవెందర్ రెడ్డి, ఐటీ ఫోర్ ఎస్‌ఐ సాయిరాం, రోడ్ సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


