సర్‌ దరఖాస్తు ముగిసింది | - | Sakshi
Sakshi News home page

సర్‌ దరఖాస్తు ముగిసింది

Oct 8 2026 4:00 AM | Updated on Oct 8 2026 4:00 AM

నవంబర్‌ 9న తుది జాబితా

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సర్‌ ప్రక్రియ చివరి దశకు చేరింది. నోటీసులు అందుకున్న ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. ఇక ఫారం 6, 7, 8 ద్వారా ఓటర్లు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన గురువారం నుంచి ప్రారంభంకానుంది. షెడ్యూల్‌ ప్రకారం పరిశీలన అనంతరం నవంబర్‌ 9న ఓటరు తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. అయితే నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను బీఎల్‌ఓలకు అందించారు. అయితేన ఈ వివరాలతోనైనా తమ ఓటు భద్రంగా ఉంటుందా? లేదా అని ఆందోళన చెందుతున్నారు.

9,11,945 మంది ఓటర్లు

సర్‌ ప్రక్రియ అనంతరం ఆగస్టు 17న జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 9,11,945 మంది ఓటర్లు ఉన్నారు. వీరే కాకుండా మరో 1,93,460 మంది ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 99 వేల మంది వరకు స్పందించి హియరింగ్‌కు హాజరయ్యారు. మరో 26,059 మంది ఓటర్లు మృతిచెందగా.. 48,310 మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. 13,016 మంది ఓటర్లు డబుల్‌ ఓటు కలిగి ఉండడంతో హియరింగ్‌కు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తొలిదశకు చేరుకోగా కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. ముసాయిదా జాబితాలో చోటు లేని ఓటర్లు సైతం కొత్తగా ఓటు హక్కు కోసం ఫామ్‌–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓటు హక్కు తొలగింపు కోసం ఫామ్‌–7, ఓటరు వివరాల సవరణకు ఫారం–8 సమర్పించాల్సి ఉండగా ఈ గడువు బుధవారంతో ముగిసింది. ఇప్పటివరకు ఫామ్‌–6, 7, 8 మొత్తం 5,505 దరఖాస్తులు సమర్పించారు. ఆయా దరఖాస్తులను పరిశీలన చేసి అర్హతను బట్టి ఓటుహక్కు కల్పించనున్నారు. చివరగా నవంబర్‌ 9న ఓటరు తుది జాబితాను ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు.

నేటి నుంచి పరిశీలన ప్రారంభం

ఫ ఫామ్‌ 6, 7, 8 ద్వారా వచ్చిన

దరఖాస్తులు మొత్తం 5,505

ఫ ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడువు

ఫ నవంబర్‌ 9న ఓటరు తుది జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement