పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన

Oct 8 2026 4:00 AM | Updated on Oct 8 2026 4:00 AM

అనంతగిరి : మండలంలోని శాంతినగర్‌లో బుధవారం జెట్పీ సీఈఓ శిరీష పర్యటించారు. ఈ సందర్భంగా చేయూత పింఛన్‌ కోసం చేసుకున్న ఒంటరి మహిళల దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే జిల్లాలో గెజిటెడ్‌ అధికారులు చేపట్టిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట ఎంపీడీఓ సుష్మ, సిబ్బంది ఉన్నారు.

వ్యవసాయ చట్టాలపై

అవగాహన అవసరం

పెన్‌పహాడ్‌ : రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండడం అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.భవ్య అన్నారు. బుధవారం పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలు నుంచి వచ్చే పథకాల పట్ల పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాలేనివారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఒగ్గు రవి, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ బొల్లెద్దు వెంకటరత్నం, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్‌న్స్‌ కౌన్సిల్‌ బట్టిపల్లి ప్రవీణ్‌ కుమార్‌, కె.ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్‌, ఎస్‌ఐ బాలునాయక్‌, ఏఈఓ వెంకట్‌రెడ్డి, పీఎల్‌వీలు వి.సోమన్న, వి.ప్రవీణ్‌, ఎం.నాగయ్య, గ్రామాల రైతులు పాల్గొన్నారు.

శాసీ్త్రయ పద్ధతులతోనే అధిక దిగుబడులు

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : పంట సాగులో శాసీ్త్రయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చంద్రశేఖర్‌, శివ ప్రసాద్‌ అన్నారు. బుధవారం ఆత్మకూర్‌ (ఎస్‌) మండల పరిధిలోని నసీంపేట గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు పొలంబడి కార్యక్రమంలో వారు మాట్లాడారు. వరి సాగులో తెగుళ్ల లక్షణాలు నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కాండం తొలుచు పురుగు, ఆకుముడుత పురుగు, గోధుమ రంగు దోమలతో కలిగే నష్టాలు నివారణ చర్యలపై వివరించారు. ప్రారంభమైన దశలోనే రోగాలు గుర్తించి సమగ్ర సస్యరక్షణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దివ్య, ఏఈఓ పవన్‌, ఉప సర్పంచ్‌ మూల వెంకటగిరి, బొడ్డు సైదులు, గంధం నరసయ్య, బిక్కునాయక్‌, దాసరి సైదులు తదితరులు పాల్గొన్నారు.

బీఈడీ పరీక్ష

ఫలితాలు విడుదల

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన బీఈడీ పరీక్ష ఫలితాలను బుధవారం ఎంజీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణ, పరీక్ష నిర్వహణలో ప్రమాణాలను పాటించడం మంచి విద్యా విధానానికి తొలి అడుగు అన్నారు. మొదటి సెమిస్టర్‌లో 760 మంది విద్యార్థులు హాజరు కాగా 59.87 శాతం, రెండవ సెమిస్టర్‌లో 3057 మంది విద్యార్థులకు గాను 81.32 శాతం, మూడవ సెమిస్టర్‌లో 267 మందికి గాను 76.78 శాతం, నాలుగో సెమిస్టర్‌లో 2798 మంది విద్యార్థులకు గాను 95.21 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఎంజీయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్‌ కొప్పుల అంజిరెడ్డి, లక్ష్మీప్రభ, సంధ్యారాణి, ప్రవళిక, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement