కోదాడ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు సరికాదాని ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం షేర్ ఆటోలో తిరిగినట్లుగా ప్రజాధనంతో హెలిక్యాప్టర్లలో తిరుగుతున్నారన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. కొందరు మంత్రులు బిల్లుల కోసం 20 శాతం కమీషన్ తీసుకొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలతో అవినీతితో పాలన సాగిస్తోందని ఆరోపించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సుంకర అజయ్‌కుమార్, ఎస్‌కె.నయీం, తొగరు రమేష్, నర్సిరెడ్డి, నల్లా భూపాల్‌రెడ్డి, జానకిరామాచారి, మండవ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


