బుల్లెట్‌ ట్రైన్‌ సాధించేవరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ ట్రైన్‌ సాధించేవరకూ పోరాటం

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

సూర్యాపేట : బుల్లెట్‌ ట్రైన్‌, రైల్వే కారిడార్‌ సాధించే వరకూ పోరాటం ఆగదని రైతు కూలి సంఘం జిల్లా నాయకుడు బోడ బాలస్వామి అన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ సాధన అఖిలపక్ష పోరాట సమితి కొనసాగిస్తున్న దీక్షలో గురువారం ఏడవ రోజు రైతు కూలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుల్లెట్‌ ట్రైన్‌ దారి మళ్లింపు చర్యను ఖండిస్తున్నామన్నారు. మొదటి అలైన్‌మెంట్‌నే కొనసాగేలా ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ దీక్షలో రైతు కూలి సంఘం నాయకులు బయ్య రామచంద్రు, బెల్లి నాగరాజు, కుంచం వెంకన్న, బయ్య సతీష్‌ కోడి బాబు, ఇరుగు వెంకటేశ్‌, బయ్య లింగయ్య, గుర్వయ్య, గంగయ్య, సత్తుపల్లి రాములు, ఇరుగు నాగయ్య, వెంకన్న రమేష్‌, కష్ణయ్య శ్రీనివాస్‌ రెడ్డి పుల్లారెడ్డి, కొమురయ్య సత్తయ్య పన్నీరు వాసుదేవరావు, పాల్గొన్నారు. దీక్షకు అఖిలపక్ష నేతలు, ఉపాధి కోసం వచ్చి పట్టణంలో స్థిరపడ్డ పంజాబ్‌ యువకులు సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement