‘సర్‌’ విజయవంతానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ విజయవంతానికి కృషి చేయాలి

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

హుజూర్‌నగర్‌ : బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌)–2 ప్రక్రియ విజయవంతానికి కృషి చేయాలని బీజేపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌–2పై నిర్వహించిన నియోజక వర్గ స్థాయి కార్యశాలలో వారు మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ రెండవ భాగం ప్రారంభమైనందున బీఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బీజేపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యశాలలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండా హరీష్‌ గౌడ్‌, అసెంబ్లీ బీఎల్‌ఏ తాళ్ల నరేందర్‌రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు భూక్య సీత, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు ఉమామహేశ్వరరావు, కుందూరు కోటిరెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, బి.వెంకట శివ, జి.వీరబాబు, కె.వెంకటేశ్వర్లు, కె.నాగిరెడ్డి, నరీ నాయక్‌, ఎ.భిక్షమయ్య, బి.నరేష్‌, ఎస్‌.ప్రదీప్‌, కె.లక్ష్మీనారాయణ, పి.చంద్రయ్య, గోపి, రామారావు, నాగరాజు, విజయ్‌, సోమయ్య, శ్రీనివాస్‌, వివిధ మోర్చాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement