సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ అధికారులతో కలిసి పరిశీలించారు. వేడుకలకు వచ్చే పౌరులకు, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జెండా ఆవిష్కరించనున్న మంత్రి ఉత్తమ్


