పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్)ను మరింత పటిష్టం చేసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్‌లో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలో ఎండ్–టు–ఎండ్ వ్యర్థాల సేకరణ, శానిటేషన్ అమలుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, మున్సిపల్ కమిషనర్లు హనుమంతరెడ్డి రమాదేవి, నాగరాజు, సతీష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పారదర్శకంగా నిర్వహించేందుకు 18న బూత్ లెవెల్ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ ఇస్తారని వివరించారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, జిల్లా రెవిన్యూ అధికారి డి.ప్రేమ్‌రాజ్, నాయకులు రాజేశ్వర్‌రావు, అంజాద్, కరుణాకర్ రెడ్డి, సత్యనారాయణ, అబీద్, గోపి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.


