బేతవోలులో ఎడ్ల పందేలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బేతవోలులో ఎడ్ల పందేలు ప్రారంభం

Feb 14 2026 10:11 AM | Updated on Feb 14 2026 10:11 AM

బేతవోలులో  ఎడ్ల పందేలు ప్రారంభం

బేతవోలులో ఎడ్ల పందేలు ప్రారంభం

చిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతర, శివరాత్రి పండుగ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందేలను (బండలాగుడు ప్రదర్శన) శుక్రవారం కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల పందేలను శాంతి యూతంగా జరుపుకోవాలని సూచించారు. మొదటి రోజు పాలపళ్ల ఎడ్ల పందేలు జరిగాయి. శని, ఆదివారాల్లో నాలుగు, ఆరు పళ్ల ఎడ్ల విభాగాలు, న్యూ కేటగిరీ ఎడ్ల పందేలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వట్టికూటి నాగయ్య, ఉప సర్పంచ్‌ ఏడుకొండలు, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్‌ నాయకులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement