కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది
సూర్యాపేటటౌన్ : కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, కానీ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆగమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని అర్థమైందని, అందుకే అడ్డూఅదుపు లేని పాలన సాగిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టడం లేదన్నారు. సాగునీరే కాదు.. తాగు నీరు కూడా సక్కగ ఇస్తలేరని విమర్శించారు. పెంచుతామన్నా పింఛన్లు ఇంకా ఎన్నడు పెంచి ఇస్తారని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కేసీఆర్ పెట్టిన రూ.లక్షతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తరని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎటుపోయినయని ప్రశ్నించారు. ఇప్పుడు జరిగే ఎన్నికలల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారని, కాంగ్రెసోళ్లు ఇళ్ల ముందుకు వచ్చినప్పుడు ప్రజలే నిలదీయాలన్నారు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఎవ్వరూ అధైర్య పడవద్దని, ఐక్యతతో విజయాలు సాధించుకుందామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి


