పండుగ ప్రయాణం సురక్షితం చేద్దాం
సూర్యాపేటటౌన్ : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయినిగూడెం యూ టర్న్, 7స్టార్ హోటల్, పిల్లలమర్రి యూ టర్న్, జనగామ రోడ్డు, అంజనాపురి జంక్షన్, కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డు చౌరస్తా, ఈనాడు ఆఫీస్ జంక్షన్, ఎఫ్‌సీఐ గోదాం జంక్షన్ వద్ద రోడ్డు భద్రత ఏర్పాట్లను ఎస్పీ నరసింహతో కలిసి ఆయన పరిశీలించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజానీకం సూర్యాపేట జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వెళ్తారని, ప్రమాదాలు సంభవించకుండా చూడాలన్నారు. రోడ్డు వెడల్పు చేయడం, బ్రిడ్జిల నిర్మాణం జరుగుతున్నందున వా హనదారులు నిదానంగా వెళ్లాలని సూచించారు. కా ర్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జాతీయ రహదారి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారాములు, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, రామారావు, ఎస్సైలు సాయిరాం, బాలునాయక్ పాల్గొన్నారు.
విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి
భానుపురి (సూర్యాపేట) : విద్యార్థులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అనీమియా తగ్గించేందుకు అవసరమైన సేవలు, పోషక పదార్థాలు అందించాలని అధికారులకు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ వెంకటరమణ తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కోటి రత్నం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్


