పత్తా లేని కాంట్రాక్టర్
నేరేడుచర్ల : మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డుల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డ్రెయిన్లు పూడిపోవడంతో మ్యాన్‌హోళ్ల నుంచి మురుగునీరు బయటకు వచ్చి రోడ్ల వెంట ప్రవహిస్తోంది. పద్మావతి వెంచర్ ఏర్పాటు చేసిన సమయంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం జరిగింది. ఆ సమయంలో పైపులు జామ్ కావడంతో మురుగునీరు బయటకు వస్తుంది. వెంచర్‌లో నివాసం ఉంటున్న ప్రజల విజ్ఞప్తి మేరకు స్పెషల్ ఫండ్ నుంచి రూ.20లక్షలు మంజూరు చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం లేదు.


