చెత్తను కాలుస్తూ.. పొగ పెడుతూ!
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో దాదాపు 30 వేల వరకు జనాభా ఉంది. పట్టణంలో చెత్త సేకరణ రోజువిడిచి రోజు సుమారు 28 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తనంతా పట్టణ శివారులోని రామస్వామిగుట్ట దగ్గర సింగర్ బెడ్‌రూమ్ ఇళ్లకు సమీపంలో ఉన్న దాదాపు 10 ఎకరాల స్థలంలో డంపింగ్ చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డుకు ప్రహరీ లేదు. అక్కడ వేసిన చెత్తను కాల్చడంతో వస్తున్న పొగకు సమీపంలోని నివాసం ఉంటున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త సేకరణకు 42 మంది పారిశుద్ధ్య కార్మికులు.. తొమ్మిది ఆటోల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. సరిపడా సిబ్బంది, వాహనాలు లేక శివారు కాలనీల్లో పూర్తిస్థాయిలో చెత్త సేకరణ జరగడం లేదు. చెత్త రీసైక్లింగ్ ఒక డీఆర్‌సీసీ యూనిట్, ఒక కంపోస్ట్ యూనిట్ ఉంది. రెండు వర్కింగ్‌లోనే ఉన్నాయి. విలీన గ్రామాల్లో చెత్త సమస్య పెద్దగా లేదు.


