రీసైక్లింగ్ లేక ఇబ్బందులు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో చెత్త సేకరణకు మొత్తం 50 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి కానీ 32 మందే ఉన్నారు. దీంతో ప్రధాన రోడ్లు మినహా, పలు వార్డుల్లో రోజు విడిచి రోజు చెత్తను సేకరిస్తుండడంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతోంది.
ఫ ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు మూడు ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారా 5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. 1వ వార్డులోని పాత నేరేడుచర్లలో ఉన్న ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు.
ఫ డంపింగ్ యార్డు చుట్టూ ప్రహరీ, యార్డులో రీసైక్లింగ్ యూనిట్ లేక చెత్తకు నిప్పంటిస్తుండడంతో పొగతో పాత నేరేడుచర్ల, కమలానగర్ వాసులకు ఇబ్బందులు తప్పడంలేదు.


