మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా చెత్త సేకరణ
మున్సిపాలిటీల్లో వీధులు చెత్తమయంగా దర్శనమిస్తున్నాయి. సూర్యాపేట మినహా మిగతా నాలుగు మున్సిపాలిటీల్లో రెండు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. డంపింగ్ యార్డుల్లో చెత్త పేరుకుపోవడంతో సిబ్బంది నిప్పు పెడుతున్నారు. దీంతో సమీపంలో ఉండే ప్రజలు దుర్వాసన, పొగతో ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డులు ఉన్నా రీసైక్లింగ్ యూనిట్లు లేవు. కొన్నిచోట్ల సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో చెత్తసేకరణ జరగడం లేదు. ఫలితంగా మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోయి వీధులు దుర్వాసన వెదజల్లుతున్నాయని స్థాన్టికులు ఆరోపిస్తున్నారు.
కోదాడ : ఎనభై వేలకుపైగా జనాభా ఉన్న కోదాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాల కొరతతో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటింటి చెత్త సేకరణ నాలుగైదు రోజులకోసారి చేస్తున్నారు. దీంతో తడి చెత్తను ఇంట్లో ఉంచుకోలేక ఇళ్లపక్కన ఖాళీ స్థలాల్లో, రోడ్ల వెంట పడేస్తున్నారు. డంపింగ్ యార్డుకు తరలించాల్సిన చెత్తను ఇలా ఎక్కడ పడితే అక్కడే వేస్తుండడంతో పట్టణం చెత్తకుప్పలా మారి దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
సగం సిబ్బందితో సతమతం
కోదాడ మున్సిపాలిటీలో ప్రస్తుతం 35 వార్డులున్నాయి. వార్డుకు ఐదుగురు సిబ్బంది, ఒక వాహనం, ఒక డ్రైవర్‌తో కలిసి ఆరుగురు పారిశుద్ధ్య సిబ్బంది చొప్పున మొత్తం 210 మంది ఉండాలి. కానీ, ప్రస్తుతం సగం వార్డులకు ఇద్దరు.. సగం వార్డులకు ముగ్గురు చొప్పున మాత్రమే సిబ్బంది ఉన్నారు. 35 చెత్త సేకరణ ఆటోలు కావాల్సి ఉండగా కేవలం 18 ఆటోలు మాత్రమే ఉన్నాయి. చెత్తను డంపింగ్ యార్డ్‌లకు తరలించడానికి 8 ట్రాక్టర్లు అవసరం కాగా ప్రస్తుతం నాలుగే పనిచేస్తున్నాయి. రెండేళ్ల క్రితం రెండు కొత్త ట్రాక్టర్లను రూ.16 లక్షలు పెట్టి కొనుగోలు చేసినా అధికారులు వాటిని సెగ్రిగేషన్ షెడ్డులో పడేశారు. అసలే సిబ్బంది కొరత ఉంటే ఎక్కువ మంది పనిచేయడం మానేసి పనిచేయించే జవాన్లుగా కాలం గడుపుతున్నారు.
సిబ్బంది ఇలా..
కోదాడలో పారిశుద్ధ్య సిబ్బంది (అవుట్‌సోర్సింగ్) 146 ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు 11, రెగ్యులర్ కార్మికులు 21, చెత్త ఆటోలు 18, ట్రాక్టర్లు 4, జేసీబీ 01, వైకుంఠధామం వాహనం ఒకటి ఉన్నాయి.
ఫ సిబ్బంది కొరతతో
ఎక్కడి చెత్త అక్కడే..
ఫ పడకేసిన పారిశుద్ధ్యం..
ఇబ్బందుల్లో పట్టణ జనం
ఫ ఒక్క సూర్యాపేటలోనే 90 శాతం వీధులు పరిశుభ్రంగా..
ఫ కోదాడలో సిబ్బంది కంటే
పనిచేయించే జవాన్లే అధికం
ఫ మిగతా మున్సిపాలిటీల్లో అంతంత మాత్రంగానే చెత్త సేకరణ
మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా చెత్త సేకరణ
మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా చెత్త సేకరణ


