ఉర్సుకు రావాలని మంత్రి ఉత్తమ్‌కు ఆహ్వానం
పాలకవీడు : మండలంలోని జాన్‌పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ బుధవారం హుజూర్‌నగర్‌లో రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉర్సులో భాగంగా ఈ నెల 23న శక్రవారం జరిగే గంథం ఊరేగింపు కార్యక్రమానికి రావాలని దర్గా ముజావర్ జానీ కోరారు. ఆయన వెంట నాయకులు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, మాలోతు మోతీలాల్, బెల్లంకొండ నరసింహారావు, ప్రేమ్‌కుమార్, దర్గా ఉత్సవ కమిటీ పెద్దలు పాల్గొన్నారు.
ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో
పరిశీలించి పరిష్కరిస్తాం
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఓటరు జాబితా తయారీలో వార్డుల్లో మ్యాపింగ్ చేసేటప్పుడు బౌండరీ పరిధిలో కొన్ని తప్పిదాలు జరిగాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరిస్తామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్పరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా, మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌న్స్‌కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు హనుమంత్‌రెడ్డి, రమాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మున్వర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహల చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ అన్నారు. బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని పీఎంశ్రీ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహం వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు. బాల్య వివాహం జరిపిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, ఎస్‌ఐ వెంకన్న, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యురాలు ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులే పంటకు మేలు
గరిడేపల్లి : సేంద్రియ ఎరువులే పంటకు మేలని కేవీకే గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్) రాజేంద్రనగర్ వారి ఆర్థిక సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమం మూడో రోజైన బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. వివిధ పంటల్లో వాడాల్సిన సేంద్రియ ద్రావణాలు, కషాయాల తయారీ విధానం, వాటి వినియోగ పద్ధతులపై రైతులకు ప్రయోగిక శిక్షణ అందించారు. అనంతరం రిటైర్డ్ శాస్త్రవేత్త బి.లవకుమార్ పలు విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు పి.అక్షిత్‌సాయి, 50మంది రైతులు పాల్గొన్నారు.
ఉర్సుకు రావాలని మంత్రి ఉత్తమ్‌కు ఆహ్వానం
ఉర్సుకు రావాలని మంత్రి ఉత్తమ్‌కు ఆహ్వానం
ఉర్సుకు రావాలని మంత్రి ఉత్తమ్‌కు ఆహ్వానం


