సబ్సిడీ గ్యాస్ పక్కదారి
కోదాడ : జిల్లా వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీలు సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో కుమ్మకై ్క సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. వాస్తవానికి ఆయా ప్రదేశాల్లో వాణిజ్య అవసరాలకు వాడాల్సిన (కమర్షియల్) సిలిండర్ల స్థానంలో సబ్సిడీ గ్యాస్‌ను బహిరంగంగా వాడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కొన్ని హోటళ్లలో ఒకేసారి నాలుగైదు సిలిండర్లను వాడుతున్నారంటే గ్యాస్ బ్లాక్ దందా ఎలా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా గడిచిన రెండు, మూడు సంవత్సరాల్లో అధికారులు ఒక్కసారి కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.
బ్లాక్ మార్కెట్‌కు ఎందుకు తరలిస్తున్నారంటే..
సాధారణంగా ఇంటి అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధర రూ.925 ఉంటుంది. వాణిజ్య అవసరాలకు వాడే 19 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,931 ఉంది. ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో హోటల్ యజమానులు వాణిజ్య సిలిండర్లను ఉపయోగించకుండా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను ఏజెన్సీల నిర్వాహకులకు అదనంగా రూ.300 నుంచి రూ.400 వరకు చెల్లించి తీసుకుంటున్నారు.
రూ.లక్షల్లో దందా..
జిల్లావ్యాప్తంగా వాణిజ్య సిలిండర్లు వాడాల్సిన హోటళ్లు, రెస్టారెంట్లు 1,200 నుంచి 1,400 వరకు ఉండగా.. వీటిలో 70 శాతం సబ్సిడీ సిలిండర్లే వాడుతున్నారు. ఒక్క ఏజెన్సీ సగటున రోజుకు 20 నుంచి 30 సిలిండర్ల వరకు పక్కదారి పట్టిస్తూ ఒక్కో సిలిండర్‌కు రూ.400 చొప్పున నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆర్జిస్తోంది. ఏజెన్సీలకు చెందిన వాహనాల్లోనే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కు సరఫరా చేస్తున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెతి చూడడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ దందా రూ.కోట్లలో జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ ఏజన్సీలో భారీగా ఉజ్యల కనెక్షన్లు
కోదాడకు చెందిన ఓ గ్యాస్ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అందించే ఉజ్వల కనెక్షన్లను వందల్లో ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు ఖాతరు చేయకుండా సదరు ఏజెన్సీ నిర్వాహకులు పట్టణంలోని ఒకే ప్రదేశంలో వందల కనెక్షన్లు ఇచ్చారని అధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టడంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి త్వరలో విచారణ చేయిస్తామని చెప్పినట్లు సమాచారం.
ఫ ఏజెన్సీల నుంచే నేరుగా
సిలిండర్ల సరఫరా
ఫ 70శాతం హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగం
ఫ వాణిజ్య సిలిండర్లు వాడాల్సి
ఉన్నా నిబంధనలు బేఖాతరు
ఈ చిత్రంలో కనిపిస్తున్నవి కోదాడలోని
ఓ టీస్టాల్‌లో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు. ఇంటి అవసరాలకు వాడే సబ్సిడీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు విక్రయిస్తూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు భారీగా
దండుకుంటున్నారు.


