గోదావరి జలాలు విడుదల
తిరుమలగిరి (తుంగతుర్తి) : జనగామ జిల్లా కొడకండ్ల వద్ద బయన్నవాగు రిజర్వాయర్ నుంచి బుధవారం ఆర్డీఆర్ ఎస్సారెస్పీ కాల్వ ద్వారా జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గోదావరి జలాలకు పూలు చల్లి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలు విడుదల చేయడం వల్ల జిల్లాలో 98 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాగా బయన్నవాగు రిజర్వాయర్ నుంచి మొదటి రోజు 531 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా జిల్లాలోని వెలిశాలకు 70 డీబీఎం ద్వారా చేరాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, కొడకండ్ల మార్కెట్ చైర్‌పర్సన్ అండాలు, అధికారులు పాల్గొన్నారు.
గోదావరి జలాలు విడుదల


