‘పేట’లో రోజుకు 50 టన్నుల చెత్త సేకరణ
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను మొత్తం 353 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతిరోజూ చెత్త సేకరణ చేసి బాలెంల సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సరిపడా సిబ్బంది ఉండడంతో చెత్త సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. మున్సిపల్ అధికారులు జరిమానా విధిస్తుండడంతో చెత్తను రోడ్ల మీద పోయడం లేదు.
శివారు కాలనీల్లోనూ సక్రమంగానే..
సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రతిరోజూ 50 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. అందులో 30 టన్నుల తడి చెత్త 15 టన్నుల పొడి చెత్త, 5 టన్నుల మిక్స్‌డ్ వెస్ట్ చెత్త ఉంటోంది. చెత్త రీసైక్లింగ్ యూనిట్లు అన్ని సరిపడా అందుబాటులో ఉండి సక్రమంగానే పనిచేస్తున్నాయి. తడి చెత్తను ఎరువుగా మారుస్తున్నారు. పొడి చెత్తను టెండర్ సిస్టం ద్వారా అమ్మకం జరిపి రీసైక్లింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో మున్సిపాలిటీకి నెలకు రూ.లక్షల్లోనే అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇక, విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కూడా చెత్త సేకరణ దాదాపు 90 శాతం సక్రమంగానే జరుగుతుంది.


