ఉప సర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలి
సూర్యాపేట : ఉప సర్పంచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలని తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు సురేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డు ఏఎఫ్‌ఓ కన్సల్టెన్సీ కార్యాలయంలో లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో గిరిజన ఉపసర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిరిజన ఉప సర్పంచ్‌ల రాష్ట్ర అధ్యక్షుడిగా బానోతు సురేష్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీతోపాటు జిల్లా కమిటీలను ఎన్నుకుంటామన్నారు. గ్రామాలో చేపట్టే అభివృద్ధి పనులు, అధికారి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకారం ఉప సర్పంచ్‌లకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనఉప సర్పంచ్‌లు అనిల్ నాయక్, రవితేజ నాయక్, నాగేశ్వరావు నాయక్, విజయ నాయక్, మోహన్ నాయక్, రామ్ సింగ్ నాయక్, ఇస్లావత్ బాలు నాయక్, గిరిజన నాయకులు పాల్గొన్నారు.


