హుజూర్‌నగర్‌లో కాషాయ జెండా ఎగురవేస్తాం
హుజూర్‌నగర్ : రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత అన్నారు. ఆదివారం హుజూర్ నగర్‌లో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ అన్ని వార్డులలో పోటీ చేస్తుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పట్టణంలో ఒక్కరికై నా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీకి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయన్నారు. సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండా హరీశ్‌గౌడ్, నాయకులు ఉమామహేశ్వరరావు, నరేందర్‌రెడ్డి, కోటిరెడ్డి, రవి, శ్రీనివాస్, గోపి, లక్ష్మణ్, నాగరాజు, విజయ్, నాగేంద్రాచారి, బలవంత్ సింగ్, నరసింహ, మురళి పాల్గొన్నారు.


