వైభవంగా లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. నిత్యకల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని దేవాలయంలో గల గోదాదేవికి తిరుప్పావై సేవాకాలం, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.


