ఎస్‌ఐఆర్‌ను వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్ –స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్)ను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శనివారం హైదదరాబాద్ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లాలోని ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి, అర్హులైన ప్రతి పౌరుని ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కె..సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్, శిక్షణ డిప్యుటీ కలెక్టర్లు రవితేజ, అనూష, తహసీల్దార్ కృష్ణయ్య, సూపరింటిండెంట్లు సంతోష్ కుమార్, శ్రీలత రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ముందస్తు చర్యలు
సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ నరసింహతో కలిస వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వివిధ రూట్లలో పండగ ముందు నాలుగు రోజులు తర్వాత నాలుగు రోజులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు పక్కాగా చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ కె.నరసింహ మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ సీతారామయ్య, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, జాతీయ రహదారి అధికారి శ్రవణ్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


