బాధితులకు భరోసా కల్పించాలి : ఎస్పీ
నూతనకల్ : వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కృషిచేయాలని సూచించారు. పండుగ సందర్భాల్లో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట తుంగతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు, ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది ఉన్నారు.


