సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట టౌన్ : సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ‘ఫ్రాడ్ కాల్ ఫుల్ స్టాప్’ పేరుతో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. బహుమతులు ఇస్తామని ఫోన్ కాల్స్ వస్తే అవి సైబర్ నేరగాళ్ల పన్నాగమని గుర్తించాలన్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరగాళ్లను అరికట్టడంలో ప్రజల సహకారం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక తయారు చేశామని తెలిపారు. జన సమూహ ప్రాంతాల్లో రోడ్డు భద్రత పట్ల, డిఫెన్సివ్ డ్రైవింగ్, అరైవ్–అలైవ్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నెలంతా పోలీస్ యాక్ట్ అమలు
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31వ తేది వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీస్ అధికారుల అనుమతులు లేకుండా ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్విహిసే చర్యలు తప్పవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను పోస్టు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఫ ఎస్పీ నరసింహ


