డీఎంహెచ్‌ఓగా వెంకటరమణ
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ పెండెం వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎన్‌సీవీబీడీసీ ప్రోగ్రాం ఆఫీసర్ గా పని చేస్తున్నారు. రెండు రోజుల్లో వెంకటరమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకాలం ఎల్బీనగర్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ ఇన్‌చార్జిగా కొనసాగారు.
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
హుజూర్‌నగర్ : పశువులకు విధిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డి. శ్రీనివాస్‌రావు సూచించారు. మంగళవారం నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఒక వేళ వ్యాధి సోకితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గేదెలు, ఆవులకు రెండు మిల్లీలీటర్ల చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించి గాలి కుంటు వ్యాధి సోకకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా వ్యాధి సోకిన గేదె పాలను దూడలకు తాపవద్దని, అప్పుడే దూడలను రక్షించుకోవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో పెంచికల్‌దిన్న పశువైద్యాధికారి జంపాల నరేష్, గోపాల మిత్రలు భుజంగరావు, సాయి కృష్ణ, స్వప్న, వంశీ, కృష్ణలతో పాటు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
హుజూర్‌నగర్ : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేసి స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలతో నిత్య కల్యాణతంతు ముగించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశంచేసి నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదనచేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, ఆంజనేయాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ధర్నాను జయప్రదం చేయాలి
సూర్యాపేట : ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేటలోని పెన్షనర్ల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఆత్మకూరు మండల శాఖ అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తూ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు కె. వీరారెడ్డి, జిల్లా కోశాధికారి ఎస్ ఏ హమీద్ ఖాన్ ,జిల్లా ఉపాధ్యక్షుడు టి. లక్ష్మీకాంత రెడ్డి, మండల కార్యదర్శి ఎస్. కె అబ్దుల్లా, డి. సత్యనారాయణ, కె. వెంకటా చారి, కె. సత్యనారాయణ రెడ్డి, కె. సురేందర్ రెడ్డి, జి. సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓగా వెంకటరమణ
డీఎంహెచ్‌ఓగా వెంకటరమణ


