మానవ అవయవాల పనితీరు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

మానవ అవయవాల పనితీరు ఇలా..

Nov 5 2025 11:02 AM | Updated on Nov 5 2025 11:02 AM

మానవ

మానవ అవయవాల పనితీరు ఇలా..

సూర్యాపేటటౌన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో మంగళవారం రెండో రోజు మెడ్‌ ఎక్స్‌ 2025 ఎగ్జిబిషన్‌ కొనసాగింది. మొత్తం 21 విభాగాలలో 200కు పైగా ఎగ్జిబిట్లను మెడికల్‌ విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జయలత మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 6వేలమందికి పైగా విద్యార్థులు ఈ ప్రదర్శనలను తిలకించినట్టు చెప్పారు. విద్యార్థులకు వైద్యరంగం పట్ల, ఆరోగ్యం పట్ల చెప్పాల్సిన అన్ని విషయాలను కూడా ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా వివరించినట్లు వెల్లడించారు. తరగతి గదుల్లో విద్యార్థులు పాఠ్యాంశాలలో నేర్చుకున్న విషయాలను మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ద్వారా ప్రాక్టికల్‌గా కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించామన్నారు. వైద్యరంగంలో వస్తున్న వివిధ సాంకేతిక పరికరాలు, వాటి పనితీరు ఆపదలో ఉన్న వారికి ఏ విధమైన వైద్యం అందిస్తారనే విషయాలను ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా విద్యార్థులకు తెలియజేసినట్లు తెలిపారు. చనిపోయిన మనిషి శరీరం చూపిస్తూ మానవ శరీరంలో ఉండే వివిధ భాగాలు పనిచేసే విధానం వివరించారని చెప్పారు. మహిళలకు పోషకార లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలు, మహిళకు ఎక్కువగా వచ్చే గర్భాశయ క్యా న్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్‌ కృష్ణయ్య, పద్మావతి, తరుణి, జెమిమా, రా ధిక, బాబురావు, శ్రీకాంత్‌, గురురాజ్‌ పాల్గొన్నారు.

మానవ శరీరంలోని వివిధ అవయవాల పనితీరును వివరిస్తున్న విద్యార్థులు

మెదడు పనితీరును వివరిస్తున్న ఎంబీబీఎస్‌ విద్యార్థి

ఫ రెండో రోజు కొనసాగిన మెడ్‌ ఎక్స్‌ ఎగ్జిబిషన్‌

మానవ అవయవాల పనితీరు ఇలా..1
1/1

మానవ అవయవాల పనితీరు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement