స్వపక్షానికి స్వేచ్ఛా రెక్కలు | - | Sakshi
Sakshi News home page

స్వపక్షానికి స్వేచ్ఛా రెక్కలు

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

అధికార పక్షానికి ఎర్ర తివాచీలు.. విపక్షానికి గృహ నిర్బంధాలు.. విశాఖ నుంచి పాలక పక్ష నాయకులు వచ్చినా మౌనం.. స్థానిక ప్రతిపక్ష నాయకులపై మాత్రం దౌర్జన్యం.. రోడ్లపై కూటమి నాయకుల స్వేచ్ఛా విహారం.. వైఎస్సార్‌ సీపీ నాయకులు కనిపిస్తే మాత్రం ఆంక్షల పర్వం..

శ్రీకాకుళం, ఆమదాలవలసలో పుర పోరులో కనిపించిన దృశ్యాలివి. రాజ్యాంగ పరిరక్షణ

దినోత్సవం రోజునే ఆ రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఎన్నికల ప్రక్రియను

అధికార పక్షం అపహాస్యం చేసింది. పోలీసులు కూడా వారికే కొమ్ము కాయడంతో సామాన్య ఓటరు ఓటేసేందుకు కూడా భయపడ్డాడు. – సాక్షి ప్రతినిధి,శ్రీకాకుళం/ పీఎన్‌ కాలనీ

రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేశారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ జనరల్‌ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో పోలీసుల చేత పోలింగ్‌ నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ, పోలీసు వ్యవస్థ మధ్య ఎన్నికలు జరిగినట్టే కనిపించింది. వైఎస్సార్‌సీపీ జనరల్‌ ఏజెంట్లను, నాయకులను రోడ్డెక్కకుండా హౌస్‌ అరెస్టులు చేసి, పోలింగ్‌లో పాల్గోనివ్వకుండా చేయగా, అధికార పార్టీ నాయకులను విచ్చలవిడిగా రోడ్ల మీదకు వదిలేశారు. జిల్లాలోని టీడీపీ, జనసేన నాయకులు చాలరని విశాఖపట్నం నుంచి నాయకులను తీసుకొచ్చారు. పోలీసుల కళ్ల ముందే విశాఖపట్నం నుంచి వచ్చిన నాయకులంతా తిరిగినా పట్టించుకోలేదు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు రోడ్లు మీద తిరుగుతున్నా పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ నాయకుల్ని మాత్రం హౌస్‌ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేశారు.

ఈ వింత వైఖరిపై పోలీసులను ప్రశ్నిస్తే పై నుంచి ఆదేశాలు మేమేం చేస్తాం.. పాటించాలి కదా.. కళ్ల ముందు జరుగుతున్నది తప్పే అని తెలిసినా కళ్లు మూసుకుని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయా వర్గాలు అన్నాయంటే నగర, పురపాలక సంఘాల ఎన్నికల పోలింగ్‌ ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దగ్గరి నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకు, జనరల్‌ ఏజెంట్లను హౌస్‌ అరెస్టు చేసి, పోలింగ్‌ నిర్వహించారు. చివరకు అభ్యర్థుల భర్తలను, వారి కుటుంబీకులను అక్రమంగా అరెస్టులు చేసి, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలింగ్‌ నిర్వహించారంటే పరిస్థితిని ఊహించవచ్చు.

ఓటర్లలో భయం.. తగ్గిన పోలింగ్‌ శాతం

పోలీసుల అండతో పలుచోట్ల టీడీపీ, జనసేన నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ నాయకుల పోలింగ్‌ కేంద్రాలకు వస్తే చాలు తరిమేశారు. అదే టీడీపీ, జనసేన నాయకులు వస్తే స్వాగతం పలికినట్టు వ్యవహరించారు. పోలీసుల వైఖరి ఓటర్లలోనూ భయం పెంచింది. చాలా మంది ఓట్లు వేయడానికి రాలేదు. దీంతో పోలింగ్‌ శాతం పడిపోయింది.

నగర వ్యాప్తంగా విశాఖ జనసేన నాయకులు

పోలింగ్‌ రోజున నగర వ్యాప్తంగా విశాఖపట్నంకు చెందిన జనసేన నాయకులు మోహరించారు. పోలీసుల కళ్ల ముందే వా హనాల్లో తిరిగారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద విశాఖకు చెందిన జనసేన నాయకులు హల్‌చల్‌ చేశా రు. కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులకే ఆంక్షలు అన్నట్టుగా పోలీసు వ్యవస్థ వ్యవహరించింది. పోలింగ్‌ రోజున కూడా విశాఖ నాయకుల చేత డబ్బు కూడా పంపిణీ చేయించారు. పోటీ చేసిన డివిజన్‌ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ, జనసేన నాయకుల ద్వారా కాకుండా విశాఖ నుంచి వచ్చిన నాయకులే అంతా చేశారు.

ఆమదాలవలసలో పోలింగ్‌ రోజున ప్రజా దర్బార్‌

ఆమదాలవలసలో ఒకవైపు పోలింగ్‌ జరుగుతుంటే పంతులపేట ఏరియాలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. కార్యకర్తల ను ఒక చోట సమీకరించి, పోలింగ్‌ సంబంధించిన సూచనలు చేశారు.

పోలింగ్‌ సరళి

రాజ్యాంగ దినోత్సవం రోజన ప్రజాస్వామ్యం ఖూనీ

పుర, పల్లెపోరులో అధికార పక్షానికి కొమ్ము కాసిన పోలీసులు

అరెస్టులతో వైఎస్సార్‌సీపీ నాయకుల నిర్బంధం

రోడ్లపై స్వేచ్ఛగా తిరిగిన టీడీపీ, జనసేన నాయకులు

శ్రీకాకుళం, ఆమదాలవలసలో వింత పరిస్థితులు

54.7%

శ్రీకాకుళం

49%

11.8%

47.1%

39.8%

18.9%

ఆమదాలవలస

75.2%

34%

16.9%

74.2%

68.1%

54.6%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement