సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తొలి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. కూటమి పా ర్టీల కుట్రలు, అధికార యంత్రాంగం అండతో సాగిన అరాచకాలు, పోలీసుల హౌస్ అరెస్టుల పర్వాలు.. ఇలా ఎన్ని కుతంత్రాలు పన్నినా గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ తన వర్గం పట్టు నిలుపుకుంది. పలుచోట్ల పోలింగ్ సమయంలో రిగ్గింగ్ చేసినా, భయబ్రాంతులకు గురి చేసినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల హవాను ఆపలేకపోయారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల దగ్గర నుంచి పోలింగ్ రిగ్గింగ్ దౌర్జన్యాల వరకు, ఓటర్ల భయబ్రాంతులకు గురి చేసిన దగ్గరి నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లగొట్టే వరకు కూటమి నాయకులు రెచ్చిపోయారు. పథకాలు తొలగిస్తామని, కొత్తగా పథకాలు అందనివ్వబోమని, గ్రామాల్లో తిరగలేరని బెదిరింపులకు గురి చేసినా, అధికారం లేనప్పుడు ఎలా గెలుస్తారో చూస్తామని అధికార దర్పం ప్రదర్శించినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు.
66.93 శాతం పోలింగ్
అరసవల్లి: జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని 173 పంచాయతీలు, 1033 వార్డులకు గురువారం పోలింగ్ నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 7 మండలాల్లో ఉన్న 194 పంచాయతీల్లో 21 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన పంచాయతీల్లోని గ్రామీణ ఓటర్లు మొత్తం 3,61,420 మంది ఓటర్లకు గాను 2,41,895 మంది అంటే 66.93 శా తం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలాస మండలంలో 16 పంచాయతీల్లో అధికంగా 73.48 శాతం, మందసలో 39 పంచాయతీల్లో 71.87, కంచిలిలో 27 పంచాయతీల్లో 69.93, కవిటిలో 19 పంచాయతీల్లో 66.06 శాతం, వజ్రపుకొత్తూరులో 29 మండలాల్లో 65.66, సోంపేటలో 23 పంచాయతీల్లో 62.45 శాతం, ఇచ్ఛాపురంలో 20 పంచాయతీల్లో అత్యల్పంగా 62. 04 శాతం పోలింగ్ నమోదైనట్లుగా జిల్లా అదనపు ఎన్నికల అధికారి స్వరూపారాణి ప్రకటించారు. ● ఇచ్ఛాఫురం మండలం ఈదుపురం పంచాయతీ ఫలితం రావాల్సి ఉంది.
మద్దతుదారులు
అడ్డంకులను అధిగమించి అద్భుత ఫలితాలు సాధించిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు
ఉద్దానంలో విజయాలు
దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌ను అధిగమించి విక్టరీ కొట్టిన వైనం
తొలివిడతలో 66.93 శాతం పోలింగ్ నమోదు
మండలం పంచాయతీలు వైఎస్సార్ సీపీ జనసేన టీడీపీ స్వతంత్ర
కవిటి 19 6 3 8 2
కంచిలి 27 9 1 17 –
ఇచ్ఛాపురం 20 7 1 11 –
వజ్రపుకొత్తూరు 29 3 2 23 1
సోంపేట 23 8 1 14 –
మందస 39 16 – 23 –
పలాస 16 10 – 6 –
మొత్తం 173 59 8 102 3


