శ్రీకాకుళం: శ్రీకాకుళం కూటమి మేయర్ అభ్యర్థి భర్త డాక్టర్ దానేటి శ్రీధర్ పోలీసులు తనను గృహ నిర్బంధంలో ఉంచారని స్వయంగా ప్రకటించుకున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచడంపై నగరం వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డాక్టర్ దానేటి మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఓ వీడియోను విడుదల చేస్తూ తాను కుటుంబంతో సహా ఉదయ మే ఓటు హక్కును వినియోగించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత తనను కూడా గృహ నిర్బంధంలో ఉంచారని తెలిపారు. కానీ ఆయన చుట్టుపక్కల ఎక్కడా పోలీసులు కనిపించలేదు. అలాగే అప్పటికే ఆయన నగరంలోని పలు బూత్‌లలో పర్యటించిన ఫొటోలను ఆయన వర్గాలే ప్రచారం చేశాయి.
ఓటేసి..
బాక్సులో వేయకుండా..
శ్రీకాకుళం: నగరంలోని దమ్మల వీధి పోలింగ్ బూత్‌లో ఓ మహిళ మేయర్‌కు సంబంధించిన బ్యాలెట్ పేపర్‌ను బాక్స్‌లో వేయకుండా బయటికి తెచ్చేసింది. దీన్ని గమనించిన ఆ ప్రాంత యువకులు నిలదీయడంతో బ్యాలెట్ పేపర్‌ను బయటకు తెచ్చేసినట్టు చూపించింది. లోపల ఉన్న సిబ్బంది ఒక ఓటు మాత్రమే వేయించి రెండో ఓటును వెయ్యనివ్వలేదని, అందువల్లనే తీసుకువచ్చేశానని ఆ మహిళ తెలిపింది. విషయాన్ని అక్క డి యువకులు మీడియా ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కానీ ఆ మహిళ బ్యాలెట్ పేపర్‌ను మళ్లీ బాక్స్ లో వే సిందో లేదో ఏ ఒక్కరికి తెలియడం లేదు. ఇదే విషయాన్ని పోలింగ్ సిబ్బందిని అడిగేందుకు కొందరు యువకులు ప్రయత్నించగా పోలీసు లు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బ్యాలెట్ పేపర్‌ను బయటకు తీసుకువచ్చి ఇస్తే డబ్బులు ఇస్తామని కూటమి పార్టీలకు చెందిన కొందరు మభ్యపెట్టడం వల్లే ఇలా తీసుకువచ్చారని పలువురు అక్కడ ఆరోపించారు.
డివిజన్‌కు నో.. మేయర్‌కు ఓకే
ఎచ్చెర్ల: మండలంలోని కుశాలపురం మున్సిపాలిటీ పరిధిలోని మేయర్ ఎన్నికలకు సంబంధించి 3,219 ఓట్లకు గాను 1414 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ డివిజన్‌కు అభ్యర్థులంతా విత్‌డ్రా చేసుకోవడంతో మేయర్‌కు మాత్రమే ఓటింగ్ జరిగింది. రాని ఓటర్ల పేరుతో రిగ్గింగ్ చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నించినట్లు సమాచారం. ఎన్నికల అధికారినీ వెళ్లగొట్టేందుకు చూశారు. ఆ సమయంలో జేసీ ఫర్మాన్ ఆహ్మద్ ఖాన్ వచ్చి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడున్న వారందరినీ బయటకు పంపించేశారు.


