లండారపుట్టుగలో టీడీపీ నేతల దౌర్జన్య కాండ | - | Sakshi
Sakshi News home page

లండారపుట్టుగలో టీడీపీ నేతల దౌర్జన్య కాండ

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

● ఎపిక్‌ కార్డుల గుర్తింపుపై రేగిన వివాదం

● ఎమ్మెల్సీ నర్తు రామారావుపై దాడికి యత్నం

● గన్‌మెన్‌కు గాయాలు

కవిటి: లండారపుట్టుగలో గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ టీడీపీ వర్గీయుల దుందుడుకు చర్యలతో హింసాత్మకంగా మారింది. ఇక్కడ పలువురు ఓటర్లు ఎపిక్‌ కార్డులను గుర్తింపు కార్డులుగా తీసుకువచ్చారు. అయితే దీనిపై వివా దం మొదలై గొడవకు దారి తీసింది. అక్కడే ఓటు వే యడానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్తు రామారావు లక్ష్యంగా రాళ్లతో దాడికి టీడీపీ వర్గీయులు దాడికి దిగారని స్థానికులు తెలిపారు. అంతా సంయమనం పాటించాలని రామారావు చేతులెత్తి విన్నవించినా ఎవరూ వినలేదు. ఓ రాయి రామారావును తాకే సందర్భంలో ఆయన పక్కనే ఉన్న గన్‌మెన్‌ ఎస్‌.దామోదర్‌ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయనకు తగిలి రక్తస్రావం జరిగింది. సీఐ డి.లక్ష్మణరావు ఆధ్వర్యంలోని సిబ్బందితో పాటు అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి.

ఈ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి నర్తు చామంతి, కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి మురిపాల కోదండరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పోలింగ్‌కు ఎపిక్‌ గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు వచ్చిన వారిపై దొంగ ఓట్లు వేయడానికి వచ్చారంటూ కూటమి అభ్యర్థి కోదండరావు, ఆయన వర్గీయులు పోలింగ్‌ కేంద్రం లోపల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలై అది కా స్తా అదుపుతప్పి పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన సమయంలో కూటమి అభ్యర్థి మురిపాల కోదండరావు, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో పాటు స్థానిక కాళింగ సామాజిక వర్గానికి చెందిన విలేకరులను కులం పేరుతో దుర్భాషలాడినట్లు ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. ఇక్కడ నర్తు చామంతి గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement