● తాత మనవడి ఆఖరి ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

● తాత మనవడి ఆఖరి ప్రయాణం

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

పూసపాటిరేగ / కంచిలి: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కంచిలి నుంచి విశాఖపట్నానికి సోమవారం ఉదయం కారులో బయలుదేరారు. తాత, అమ్మమ్మ, మనవలు, కుమార్తె కబుర్లలో మునిగిపోయారు. అల్లుడే డ్రైవింగ్‌ కావడంతో నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. భోగాపురం మండలం పోలిపల్లి ఫ్లైఓవర్‌పై కనురెప్పపాటులో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఆవలవైపు ఉన్న రోడ్డుపైకి చేరింది. అంతే... అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొని 80 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో తాతా మనవడు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం...

కంచిలిలో నివసిస్తున్న మన్యాల సూరిబాబు (60), లక్ష్మి.. ఇంటికి అల్లుడు రాపాక కిశోర్‌కుమార్‌, కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు రాపాక సాత్విక్‌ రిహాన్‌సుహాసన్‌ (ఏడాదిన్నర), మరో మనవరాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు కొయ్య నేహశ్రీ ఇటీవల కారులో వచ్చారు. అక్కడ పనులు ముగించుకుని రాజమండ్రిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు అందరూ బయల్దేరారు. తొలుత విశాఖపట్నం మధురవాడలో నివసిస్తున్న అల్లుడు కిశోర్‌కుమార్‌ ఇంటికి చేరుకోవాలనుకున్నారు. మరో అరగంట సమయంలో ఇంటికి చేరుకుంటారనగా.. పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై ఉన్న ఫ్లై ఓవర్‌పై జరిగిన ప్రమాదంలో సూరిబాబు, మనవడు సాత్విక్‌రిహాన్‌సుహాసన్‌ దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement