రైతు బేజారు | - | Sakshi
Sakshi News home page

రైతు బేజారు

Jun 22 2026 12:12 AM | Updated on Jun 22 2026 12:12 AM

రైతు బేజారు కాగితాలకే పరిమితం.. ఆదరణ కరువై.. ర్లు

అంతా గందరగోళం

మున్సిపాలిటీలో కూరగాయల

కొనుగోలుకు తప్పని పాట్లు

శ్రీకాకుళంలో ఆదాయం సమకూరుతున్నా కానరాని సౌకర్యాలు

ఆమదాలవలసలో ఆదరణ లేక

మూసివేత

పలాసలో ప్రతిపాదనలకే పరిమితం

ఇచ్ఛాపురంలో డైలీ మార్కెట్‌లోనే విక్రయాలు

ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించాలన్న ఉద్దేశంతో నేరుగా రైతుల ద్వారానే విక్రయాలు జరిపేందుకు పట్టణాల్లో ఏర్పాటు చేసిన రైతుబజార్లు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అటు విక్రేతలతో పాటు ఇటు కొనుగోలుదారులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రైతుబజారు ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతున్నా సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. ఆమదాలవలస మున్సిపాలిటీలో నిర్వహణ కొరవడి రైతుబజారు మూతపడింది. ఇక, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో రైతుబజారు కలగానే మిగిలిపోయింది.
కాగితాలకే పరిమితం..
ఆదరణ కరువై..

ఆదాయం ఫుల్‌..అభివృద్ధి నిల్‌

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): జిల్లా కేంద్రంలోని రైతు బజారులో మొత్తం 96 షాపులున్నాయి. అందులో సుమారు 25 వరకు అద్దెలు వచ్చే షాపులున్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా రూ.1,73,640 సొమ్ము అద్దె రూపేనా వస్తోంది. ఏటా సుమారు రూ.20లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇంత మొత్తం వస్తున్నా ప్రభుత్వం రైతు బజారులో సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. సరైన సదుపాయాలు లేక ఇప్పటికే సగానికి పైగా షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం రెండు గేట్లకు ఎదురుగా ఉండే 20 షాపుల్లోనే పూర్తిస్థాయిలో కూరగాయలు అమ్మకాలు జరగుతున్నాయి. మిగిలిన షాపుల యజమానులకు వ్యాపారాలు లేక అసలు దుకాణాలే తియ్యడం లేదు.

కనీస సౌకర్యాలు కరువు..

రైతుబజారులో వ్యాపారుల నుంచి అద్దెలు వసూలు చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కంప్యూటర్‌ కాటాలకు చార్జింగ్‌ పెట్టుకునేందుకు ప్లగ్‌పిన్‌లు కూడా లేవు. ఫ్యాన్‌లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు షాపులకు ఒక లైటుతో చాలీచాలనీ విద్యుత్‌ కాంతితో చీకటిపడితే వ్యాపారాలు చేయలేని పరిస్థితి. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణం. పురుషులకు ఆరు మరుగుదొడ్లకు గాను రెండు మాత్రమే తెరిచి ఉన్నాయి. మహిళల మరుగుదొడ్లదీ అదే పరిస్థితి.

చినుకుపడితే చెరువే..

రైతుబజారును ఎత్తుచేయాలని, మార్కెట్‌ మధ్యలో నిలిచిపోయిన వర్షం నీరు బయటకు వెళ్లేలా చేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు నిధులు మంజూరు చేయడం..అరకొర పనులు చేసి నిధులు స్వాహా చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో రైతుబజారు ఆధునికీకరణ పేకట సుమారు రూ.40లక్షలు నిధులు ఖర్చుచేసి నాణ్యతలేని పనులు చేసి మమా అనిపించేశారు. దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా రైతుబజారులోకి వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుబజారు అభివృద్ధిపై దృష్టి సారించాలని రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement