జాతీయ పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీలకు ఎంపిక

Jun 22 2026 12:12 AM | Updated on Jun 22 2026 12:12 AM

టెక్కలి: నాసిక్‌లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న జాతీయ స్థాయి పెన్‌కాక్‌ సిలాట్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీలకు కోటబొమ్మాళి గౌతమ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు ఎంపికై నట్లు కోచ్‌ సామ గౌతమ్‌ ఆదివారం తెలిపారు. ముంగి అర్జున్‌, గొండు భవి భాస్కర్‌నాయుడు తదితరులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరిని అసోసియేషన్‌ ప్రతినిధులు ఆర్‌.దయామయ, ఎన్‌.లక్ష్మణ్‌నాయుడు, ఎం.గౌతమి అభినందించారు.

వైన్‌షాపులో చోరీ

హిరమండలం: మేజర్‌ పంచాయతీ హిరమండలంలో ఎస్‌బీ వైన్‌ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి ప్రవేశించి రూ.2.30 లక్షల నగదు దోచుకుపోయారు. ఉదయం సిబ్బంది వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న హిరమండలం పోలీసులు, క్లూస్‌టీమ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హెచ్‌సీ సర్వేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోను ఢీకొన్న బైక్‌

రణస్థలం: లావేరు మండలం రావివలస సమీపంలో ఆదివారం ఉదయం ఆటోను ఓ బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న షేక్‌ షాయిబ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రణస్థలం సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో రాంగ్‌ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్‌లో ఉన్న గొర్రె చర్మాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

కాంప్లెక్స్‌ కిటకిట

శ్రీకాకుళం అర్బన్‌ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. నీట్‌ పరీక్ష రాసే అభ్యర్థులు, పలువురు ప్రయాణికులతో కాంప్లెక్స్‌ కళకళలాడింది. సరిపడా బస్సులు లేక నిరీక్షణ తప్పలేదు. బస్‌లు ఫుట్‌పాత్‌ వద్దకు చేరుకున్న వెంటనే సీట్ల కోసం ఎగబడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement