కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో ఏపీజీవీబీ బ్రాంచి వద్ద అలికాం–బత్తిలి రోడ్డు గోతులమయంగా మారింది. నిత్యం రద్దీగా ఉన్న ఈ రోడ్డు పాడైపోవడంతో ఇటీవలే సుమారు రూ. 26 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. అయితే రోడ్డుకు ఓ వైపు కాలువ లేకపోవడం, మరో వైపు ఉన్న కాలువ ఎత్తుగా ఉన్నందున రోడ్డుపైనే వర్షపునీరు నిలిచిపోతోంది. దీంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


