శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధర ఎందుకు తగ్గించలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సీపీఎం జిల్లా కా ర్యదర్శి డి.గోవిందరావు ప్రశ్నించారు. శ్రీకాకు ళం నగరంలో పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డులో శ్రీకాకుళం కళాసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజల నిజ వేతనం పాతాళంలో కి పడిపోయిందన్నారు. అంబానీ, అదానీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలిచ్చి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుంటే ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా బి. చిన్నారావు, అధ్యక్షులు ఎం.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి పళ్ల అప్పలరాజు, కోశాధికారి పంగ సత్యనారాయణ, ముత్యాలమ్మ వెజిటేబుల్ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా వేలాద్రి దుర్గారావుతో పాటు 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
పిడుగుపాటుకు ఆవు మృతి
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం డొంకలబడవంజలో శనివారం రాత్రి పిడుగుపడింది. ఈ ఘటనలో గేదెల జనార్దనరావుకు చెందిన ఆవు మృతి చెందింది. పశువుల శాలకు సమీపంలో ఉండగా పిడుగు పడడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందింది. దీంతో బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. మృతిచెందిన ఆవు రూ.50 వేలు వరకూ ఉంటుందని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.


